మెగా156 కోసం ఆ హీరోయిన్ రిపీట్.. దాదాపు 17 ఏళ్ళ తరువాత

మెగా156 కోసం ఆ హీరోయిన్ రిపీట్.. దాదాపు 17 ఏళ్ళ తరువాత

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం మెగా156(Mega156) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియాలో లెవల్లో రానున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయితే మెగా156 కోసం ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ సెలెక్ట్ అయిపోయారు కానీ.. హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాను. అనుష్క, మృణాల్ ఠాకూర్, త్రిష ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరోసారి మెగా156 హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ త్రిషను తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే త్రిష మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో నటించారు. దాదాపు 17 ఏళ్ళ తరువాత ఈ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తతం త్రిష కూడా చాలా ఫామ్ లో ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ సక్సెస్ ను మెగా156 తో కూడా కంటిన్యూ చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. త్రిష ఎంట్రీతో మెగా156 పై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. మరి ఇన్ని స్పెషాలిటీలతో వస్తున్న ఈ భారీ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి.