విజయవంతంగా ముగిసిన సౌత్ ఇండియా కంటెంట్ సమ్మిట్

విజయవంతంగా ముగిసిన సౌత్ ఇండియా కంటెంట్ సమ్మిట్

హైదరాబాద్​, వెలుగు: మొట్ట మొదటిసారిగా ఈ నెల తొమ్మిదిన బెంగళూరులోని హోటల్​ లలిత్ అశోక్‌‌లో   సౌత్ ఇండియా కంటెంట్ సమ్మిట్ 2024ను  విజయవంతంగా ముగించామని ఫోర్త్​ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ ప్రకటించింది. పరిశ్రమకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో కంటెంట్ సృష్టి, పరిశ్రమ తీరుతెన్నులు, విస్తరణ గురించి అర్ధవంతమైన చర్చలు జరిగాయి. దక్షిణాది కంటెంట్ సృష్టి రంగం ఎంతో వృద్ధిని సాధించింది. డిజిటల్ కంటెంట్ వినియోగంలో పెరుగుదలతో, ప్రేక్షకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిశ్రమ వేగంగా మారుతోంది. ఈ సమ్మిట్​లో చాలా అంశాలపై  ప్యానెల్ డిస్కషన్లు జరిగాయి. పరిశ్రమ పోకడలు, సమర్థవంతమైన వ్యూహాలు,  కంటెంట్ సృష్టికి సంబంధించిన వివిధ అంశాల గురించి ఎక్స్​పర్టులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు.  ది హిందూ, ఓమ్నికామ్ మీడియా గ్రూప్, సెరియోన్ మీడియా, బ్రిల్, కామధేను టెలిఫిల్మ్స్, ఐబీడబ్ల్యూ జేపీ ఎక్స్‌‌పోర్ట్స్‌‌, రేడియో సిటీ, పుతియతలైమురై టీవీ, వీ6 న్యూస్, రిపోర్టర్ టీవీ, రిపబ్లిక్ ఇంగ్లీష్, రిపబ్లిక్ కన్నడ, వికటన్  ట్రైబ్స్ అవుట్‌‌డోర్ పార్టనర్లు/స్పాన్సరర్లుగా వ్యవహరించాయి. వీటి సహకారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడింది.