హైదరాబాద్, వెలుగు: సౌత్ ఇండియన్ బ్యాంక్ 2026 మార్చి క్వార్టర్లో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ.1,455 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.1,302 కోట్లతో పోలిస్తే ఇది 11.69 శాతం పెరుగుదల. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.2,23,620 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా రూ.2,373 కోట్లుగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. వాటాదారులకు 45 శాతం డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసింది. బ్యాంకు గ్రాస్ఎన్పీఏలు 3.20 శాతం నుంచి 1.43 శాతానికి, నెట్ఎన్పీఏలు 0.29 శాతానికి తగ్గాయి. బ్యాంక్ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో వడ్డీయేతర ఆదాయం రూ.2,009 కోట్లుగా నమోదైంది.
