వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు సౌథీ డౌటే!

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు సౌథీ డౌటే!

అక్లాండ్‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ టిమ్‌‌‌‌ సౌథీ కుడి బొటన వేలికి గురువారం సర్జరీ చేయించుకోనున్నాడు. దీంతో వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. గతవారం ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన నాలుగో వన్డేలో క్యాచ్‌‌‌‌ పట్టే క్రమంలో సౌథీ వేలికి గాయమైంది. 

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా కివీస్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌ 5న ఇంగ్లండ్‌‌‌‌తో తొలి మ్యాచ్‌‌‌‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌‌‌‌కు సౌథీ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ మొదలైంది.