ఈశాన్య భారతదేశానికి రుతుపవనాలు

ఈశాన్య భారతదేశానికి రుతుపవనాలు

రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అనుకున్న సమయానికంటే ముందుగానే కేరళ రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు ఈశాన్య భారతదేశానికి విస్తరిస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు, మూడు రోజుల్లో అస్సోం, మేఘాలయలో భారీ వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. శుక్రవారం, శనివారం నాటికి రుతుపవనాలు గోవాకు చేరుకోవచ్చని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య & తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, రాబోయే రెండు రోజుల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లొని మిగిలిన భాగాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.


రాబోయే ఐదు రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో విస్తారమైన లేదా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే.. కోస్తా కర్ణాటక, కేరళ, లక్ష ద్వీప్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షం పడొచ్చని తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. మరోవైపు.. రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానా, దక్షిణ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ లలో జూన్ 03, జూన్ 04వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతాయని అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రెండు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతుందని పేర్కొంది. అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం : -

మూడు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల కౌంటింగ్


కర్ణాటక ఆరోగ్య మంత్రికి కొవిడ్ పాజిటివ్