రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులు దంచికొట్టుడే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులు దంచికొట్టుడే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. మంగళవారం(మే 27) దక్షిణాన మహబూబ్ నగర్ లోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. బుధవారం (మే 28) మొత్తం రాష్ట్రమంతా వ్యాపించాయి. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.  గాలి విచ్చిన్నత కారణంగా  నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. 

రుతుపవనాల రాకతో ఈదురుగాలులు  గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:

నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా హెవీ రెయిన్ ఫాల్ ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు  కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. దీంతో రైతులు, మత్స్యకారులు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:

రుతుపవనాలు వేగంగా కదిలి రాష్ట్రమంతా వ్యాపించడంతో కొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు.

►ALSO READ | బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్ప పీడనం : తుఫాన్ గా మారే విషయంపై ఉత్కంఠ

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే రాష్ట్రాలే కాకుండా.. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి తేలికపాటి, అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తావావరణ కేంద్రం తెలిపింది. గత కొన్నాళ్లుగా కురుస్తున్న వానల కారణంగా వాతావరణం చల్లబడింది.  ప్రస్తుతం సాధనకంటే ఏడు నుంచి తొమ్మిది డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు.

నైరుతి రుతుపవనాల కారణంగా.. రేపు, ఎల్లుండి (మే 29, 30) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. 

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు అధికారులు.