ఆదిలాబాద్​,ఆర్మూర్​ రైల్వే లైన్​ కంప్లీట్​ చేయాలి

ఆదిలాబాద్​,ఆర్మూర్​ రైల్వే లైన్​ కంప్లీట్​ చేయాలి

ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ – ఆర్మూర్ రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. రైల్వేలైన్​అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్​ ఇవ్వడానికి ముందుకు రావడంలేదని .. కేంద్ర రైల్వే శాఖనే పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించి పనులు చేయాలని కోరారు. గురువారం ఎంపీ ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి సమస్య వివరించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని రైళ్ల రాకపోకలను పొడిగించాలన్నారు. నిలిచిపోయిన రైల్వే లైన్ల పనులు పునరుద్ధరించాలన్నారు. 

సికింద్రాబాద్– సిర్పూర్ వరకు నడుస్తున్న భాగ్యనగర్ ఎక్స్​ప్రెస్​రైలును బల్లార్షా వరకు పొడిగించాలన్నారు. సికింద్రాబాద్– నాగపూర్ , హౌరా నుంచి నాగపూర్ వరకు సిర్పూర్ కాగజ్​నగర్​మీదుగా నడుస్తున్న  రైళ్ల టైమింగ్స్​క్రమబద్ధీకరించాలన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణ ఎక్స్​ప్రెస్, హజ్రత్ నిజామొద్దీన్​రైళ్లను కాగజ్ నగర్ లో హాల్టింగ్​కల్పించేలా చూడాలన్నారు. వీటన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.