ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట, వెలుగు: 18 భాషల్లో 45వేలకు పైగా గీతాలను ఆలపించిన బాలసుబ్రహ్మణ్యం నేటి సింగర్లకు స్ఫూర్తి  అని మున్సిపల్ వైస్ చెర్మన్ హరి నారాయణ్ బట్టడ్,  స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ గీత విశ్వనాథ్ అన్నారు.  ఆదివారం ఎస్పీ బాలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా.. ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో పేట బాలకేంద్రంలో  బాలు ఫొటోకు పూల మాలలువేసి నివాళులర్పించారు. అనంతరం బాలు ఆత్మకు శాంతికలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత చిన్నారులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌ పట్టణ అధ్యక్షుడు విజయసాగర్, అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు మనోహర్ ప్రసాద్ గౌడ్, టీడీపీ నాయకులు ఓం ప్రకాష్, టీటీడీ ధార్మిక ప్రచారకులు శ్రీశైలం, టీవీ రేడియో గాయకులు సంగ నర్శింహులు, ప్రముఖ చిత్రకారులు తాటి నర్సప్ప, లక్ష్మణ్‌‌, కవి రామ్మోహన్ రావ్, తాటి కృష్ణ, బాలు ఫ్యాన్స్ సభ్యులు మహిపాల్ రెడ్డి, రామకృష్ణ కల్యాణి,  వసంత్, రవితేజ  పాల్గొన్నారు.

ఇన్ఫోసిస్​ క్యాంపస్‌‌లో పేట విద్యార్థులు

నారాయణపేట, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని ఇన్ఫోసిస్​ టెక్నాలజీ క్యాంపస్​ను నారాయణపేట జిల్లా విద్యార్థులు ఆదివారం సందర్శించారు. కలెక్టర్​హరిచందన సూచన మేరకు తెలంగాణ ఇన్నోవేషన్స్​సెల్​ఆధ్వర్యంలో సెక్టోరియల్‌‌ ఆఫీసర్‌‌‌‌ శ్రీనివాస్‌‌, సైస్‌‌ ఆఫీసర్‌‌‌‌ భానుప్రకాశ్, టీచర్లు స్టూడెంట్లను తీసుకెళ్లారు. క్యాంపస్‌‌లో ఇన్నోవేషన్స్‌‌, రీసెర్చ్​ఎలా చేస్తారో.. అక్కడి ప్రతినిధులు వివరించారు.  క్యాంపస్​ పనితీరు, సోలార్​ప్లాంట్​ ఇన్నోవేషన్​, లైబ్రరీ తదితరాలను చూపించారు.   

చివరి ఆయకట్టుకు నీళ్లియ్యాలె

వీపనగండ్ల, వెలుగు: భీమా ఫేజ్‌‌1,2తో పాటు జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి.బాల్ రెడ్డి డిమాండ్ ​చేశారు.  రాష్ట్ర రైతు సంఘం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎం కృష్ణయ్య అధ్యక్షతన రెండవ మహాసభ  నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. దీనిపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేదంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల కొత్త కమిటీని ఎన్నుకున్నారు.  అధ్యక్షుడిగా ఎం కృష్ణయ్య, కార్యదర్శి మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులుగా ఆర్ మౌలాలి, రాములు, సహాయ కార్యదర్శులుగా శేఖర్ రెడ్డి, ఈశ్వర్ మరో13 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.  నాయకులు  నిరంజన్, వెంకటేశ్వర్లు గౌడ్, బాల గౌడ్  పాల్గొన్నారు.

కంపెనీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

మరికల్, వెలుగు: మరికల్ ​మండలం చిత్తనూర్​ వద్ద నిర్మిస్తున్న జూరాల ఆగ్రో ఇండస్ట్రీస్​ ఇథనాల్​ కంపెనీతో అనేక నష్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే ఆ  స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆల్ ​ఇండియా కన్వీనర్​ బి.లక్ష్మయ్య కోరారు. ఆదివారం మరికల్‌‌లో రౌండ్​ టేబుల్​ సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భంగా కంపెనీ వల్ల కలిగే నష్టాల గురించి చర్చించారు. అనంతరం పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్​ ఎం.రాఘవచారి మాట్లాడుతూ కంపెనీ ప్లేస్‌‌లో  వెటర్నరీ లేదా వ్యవసాయ వర్సిటీ, మెడికల్​ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు.  జూరాల ప్రాజెక్టు నుంచి వికారాబాద్​వరకు సాగు, తాగు నీటి కోసం 70 టీఎంసీల కెపాసిటీతో  ప్రాజెక్టు నిర్మించాలన్నారు.  ఈ డిమాండ్ల సాధన కోసం మాజీ సర్పంచుల నుంచి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు స్పందించాలని కోరారు.  ఈ సమావేశంలో నేతలు వెంకట్రాములు, సరోజ, యాదగిరి, నగేశ్​, రాజు, చక్రవర్తి, లక్ష్మయ్య, గోవింద్, మురళి, రవీందర్​రెడ్డి, చింతలయ్య పాల్గొన్నారు. 

స్వగ్రామానికి చేరిన నగేషమ్మ

అయిజ, వెలుగు: నాలుగేళ్ల క్రితం  తప్పిపోయిన మల్దకల్‌‌ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన నగేషమ్మ స్వగ్రామానికి చేరుకున్నారు. 2018లో తప్పిపోయిన ఈమె ఇటీవల బంగ్లాదేశ్ బార్డర్‌‌‌‌లో కనిపించిన విషయం తెలిసిందే.   అసోంలోని స్టేట్ హోంలో ఉందని సమాచారం అందుకున్న ఆమె కొడుకు అక్కడికి వెళ్లి  గ్రామానికి తీసుకొచ్చాడు.  పెద్దల పండుగ రోజే అమ్మ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు.  కాగా, ఎస్సై శేఖర్‌‌‌‌  నగేషమ్మ పరామర్శించి.. జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. 

దేవీ శరన్నవరాత్రోత్సవాలకు జోగులాంబ ముస్తాబు

అలంపూర్, వెలుగు: పీఠాల్లో ఒకటైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర టెంపుల్‌‌ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది.  సోమవారం ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవాచనం, మహాకలశ స్థాపన తదితర పూజలు చేసి..  ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో భక్తులకు  దర్శనం ఇవ్వనున్నారు.  అక్టోబర్ 2న అమ్మవారి కల్యాణం,  సాయంత్రం  సింహ వాహన సేవ,  3న  రథోత్సవం నిర్వహించనున్నారు.
4న కాళరాత్రి పూజలు,  5న విజయదశమి సందర్భంగా  మహాపూర్ణహుతి,  శమీపూజ, తెప్పోత్సవంతో  వేడుకలకు ముగింపు పలుకనున్నారు. 

డంపింగ్ యార్డు వద్దు

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని  అంబేద్కర్​ కాలనీ(1వ వార్డు)కి సమీపంలోనే ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని కాలనీ యువకులు డిమాండ్ చేశారు.  డంపింగ్ యార్డు వద్ద రెండు రోజుల కింద చేపట్టిన నిరసన దీక్షను ఆదివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని, వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కలెక్టర్ , మున్సిపల్‌‌ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  కాగా,  మున్సిపల్​ అధికారులు, సిబ్బంది యార్డు వద్దకు వెళ్లి నచ్చజెప్పినా వినలేదు.  యాంటీ లార్వా స్ర్పే చేయాలని చూడగా అడ్డుకున్నారు.