శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు నిర్మించిన మనీషా ఆర్ట్స్ సంస్థ చాలా రోజుల తర్వాత అన్నపరెడ్డి స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్’. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీహర్ష, ఎస్పీ చరణ్ తండ్రీకొడుకులుగా కనిపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంది. తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషన్‌ను, బాండింగ్‌ని చూపించేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.