మెదక్ జిల్లా వ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్ జిల్లా వ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి :  ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్ ​జిల్లా వ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాస్​ రావు మాట్లాడుతూ..  గంజాయి, పేకాట, బెట్టింగ్‌‌‌‌లు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల రోజుల్లో జిల్లాలోని ఆయా పోలీస్​స్టేషన్లలో కేసుల వివరాలు, వాటి పురోగతిపై ఆరా తీశారు.

  ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు అన్నారు.  ఎస్సైగా విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ పొందుతున్న మహ్మద్ గౌస్​ను పోలీసు కార్యాలయంలో  పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా  నెలరోజుల వ్యవధిలో 140 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించామని 90 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

సిద్దిపేట రూరల్, వెలుగు: కమిషనరేట్ పరిధిలో పనిచేసి, పదవీ విరమణ పొందిన కోల కనకయ్య గౌడ్, మేకల కొమరయ్య, వడపల్లి రఘుకు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.  రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందజేశారు. ఎస్బీ  సీఐ శ్రీధర్ గౌడ్, పూర్ణచందర్, రాజేశ్, ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, సీసీ నితిన్,రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.