మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో ఈనెల 15న నిర్వహించే స్పెషల్ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జిల్లాలోని పీఎస్‌ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని, వాటిలో రాజీపడదగిన కేసులను గుర్తించి స్పెషల్ లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు.
కోర్టుల చుట్టూ తిరగడం కన్నా పరస్పర అవగాహనతో రాజీ పడడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. క్రిమినల్ కేసుల్లో బాధితులకు న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యమని, కేసుల పరిష్కారంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్, సీఐలు మహేశ్, జార్జ్, రాజశేఖర్ రెడ్డి, వెంకట రాజా, రేణుక, సందీప్, కృష్ణమూర్తి, ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.
