
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అడిషనల్ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు కు చెందిన పిల్లుట్ల మహేశ్ గౌడ్ తన పొలం విషయంలో ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. అలాగే పలువురు ఫిర్యాదుదారుల సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిఅధికారులకు సూచనలు చేశారు