తంగళ్లపల్లి, వెలుగు: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులను రివ్యూ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టి వారి కదలికలను గమనించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. స్టేషన్ పరిధిలో క్రిటికల్, నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను అమలుచేయాలన్నారు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్ఐ ఉపేందర్ ఉన్నారు.
