
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో ఆపరేషన్ ముస్కాన్ టీంతో రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార సముదాయాలు, గోదాంలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ నెల 1 నుంచి 31 వరకు పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆఫీసర్లు టీంలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారని, పది రోజుల్లో 31 మంది పిల్లలను గుర్తించి పేరెంట్స్‌కు అప్పజెప్పామన్నారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, సీఎంసీ చైర్‌పర్సన్ అంజయ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, పోలీసులు పాల్గొన్నారు.
10 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు
జిల్లా వ్యాప్తంగా అక్రమంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ చేస్తున్న 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మహేశ్ బి.గీతే తెలిపారు. గురువారం పోలీసులు 20 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించగా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకొని సుమారుగా రూ.60 లక్షల విలువైన వివిధ డాక్యుమెంట్లతో పాటు తాకట్టు పెట్టుకున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న నల్ల ప్రదీప్, దూస శ్రీనివాస్, దుమాల మొండయ్య, ఉషాకోయిలా మనోహర్, ఎనగందుల శ్రీహరి, ఒడ్నాల ఆంజనేయులు, మేడిశెట్టి పురుషోత్తం, గొర్ల రాములు, బొందుగుల జగదీశ్వర్, దండవేణి అశోక్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.