కామారెడ్డి జిల్లాలో150 మొబైల్ ఫోన్ల రికవరీ : ఎస్పీ రాజేశ్చంద్ర

 కామారెడ్డి జిల్లాలో150 మొబైల్ ఫోన్ల రికవరీ : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్​ ద్వారా పొగొట్టుకున్న 150 మొబైల్​ ఫోన్లను రికవరీ చేసినట్లు మంగళవారం ఎస్పీ రాజేశ్​చంద్ర మీడియాకు తెలిపారు.  బాధితులు  జిల్లా పోలీసు ఆఫీసుకు వచ్చి ఫోన్లను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. 

సెల్​ఫోన్​ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. సెల్​ఫోన్ల రికవరీకి జిల్లా పోలీస్ ఆఫీసులో  స్పెషల్ టీమ్స్​ ఏర్పాటు చేశామన్నారు.  ఫోన్లు రికవరీ చేసినందుకు టీమ్స్​ను ఎస్పీ అభినందించారు