
కామారెడ్డి టౌన్, వెలుగు : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లా ఆఫీస్‌లో నెల వారీ రివ్యూ మీటింగ్ జరిగింది. స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, క్లియర్‌పై చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ పాత, కొత్త కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే దిశగా పని చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉండి, సత్వర న్యాయం అందించాలన్నారు.
డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. దొంగతనాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు రాత్రి వేళల్లో పహారా కాయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్‌అండ్‌డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. దీపావళి పండుగ సజావుగా నిర్వహించుకులా చూడాలన్నారు. జూదంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్యారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.