చట్ట వ్యతిరేక పనులు చేస్తే జైలుకే : ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి

చట్ట వ్యతిరేక పనులు చేస్తే జైలుకే : ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యలాపాలు చేసే వారిపై కేసులో పెట్టి జైలుకు పంపిస్తామని ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్  కార్యాలయంలో మంత్లీ క్రైం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్  ఇన్వెస్టిగేషన్   ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

కేసు విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వివిధ సమస్యలతో స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా  పోలీస్  శాఖపై నమ్మకం కలిగించేలా పని చేయాలన్నారు. జిల్లాలో  గంజాయి, పీడీఎస్  బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్మే, గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. అడిషనల్  ఎస్పీ  రామదాసు తేజావత్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఎస్బీ ఇన్స్​పెక్టర్  మధుసూదన్  పాల్గొన్నారు.