నల్గొండ జిల్లాలో మహిళలకు అండగా భరోసా సెంటర్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ జిల్లాలో మహిళలకు అండగా భరోసా సెంటర్ : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు: లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలకు భరోసా సెంటర్ అండగా నిలుస్తోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్గొండలోని భరోసా సెంటర్ ను ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, సిబ్బంది విధులు, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. బాధితులకు వైద్యం, న్యాయసహాయంతోపాటు కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. 

లైంగిక వేధింపులకు గురయ్యేవారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలల రక్షణకు సంబంధించి పకడ్బందీ చట్టాలున్నాయని, వేధింపులకు పాల్పడితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లాలో 19 పోక్సో కేసుల్లో 20 మంది నేరస్తులకు శిక్ష పడిందని, బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందిందని తెలిపారు.