
న్యూఢిల్లీ: భూమి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో నిరంతరం తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) ఢిల్లీ ఆకాశంలో తళుక్కున మెరిసింది. మంగళవారం (జులై 08) తెల్లవారుజామున 5.42 గంటలకు ఐఎస్ఎస్ను నగరవాసులు స్పష్టంగా చూశారు.
కొంతమంది ఈ అరుదైన దృశ్యాలను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేసి.. ‘హాయ్ శుభాంశు శుక్లా’ అంటూ మెసేజ్లు పంచుకున్నారు. కాగా, భవిష్యత్తులో కూడా భారత గగనతలం మీదుగా ఐఎస్‌ఎస్ ప్రయాణించనుందని సైంటిస్టులు చెబుతున్నారు.
భూమి నుంచి సగటున 400 కి.మీ. ఎత్తులో ఐఎస్ఎస్ చక్కర్లు కొడుతుంటుంది. ఇది ఒకసారి భూమిని చుట్టి రావడానికి దాదాపు 93 నిమిషాలు పడుతుందని చెప్పారు.