స్పెయిన్ గోల్స్ వర్షం...కోస్టారికాపై విజయం

స్పెయిన్ గోల్స్ వర్షం...కోస్టారికాపై విజయం

ఫిఫా వరల్డ్ కప్లో స్పెయిన్ చెలరేగింది. గ్రూప్-ఈలో భాగంగా కోస్టారికాతో జరిగిన  మ్యాచ్‌లో స్పెయిన్  7–0తో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడు ఆడిన స్పెయిన్..పసికూనపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనభర్చింది. 

ఫస్టాఫ్లో మూడు గోల్స్..
ఏకపక్షంగా సాగిన ఫస్ట్ హాఫ్లో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. మ్యాచ్ స్టార్ట్ అయిన తొలి 11 నిమిషాల్లోనే స్పెయిన్ బోణి చేసింది. ఆ తర్వాత మరో రెండు గోల్స్ చేసి..3–0తో తొలి అర్థభాగాన్ని ముగించింది. 11 వ నిమిషంలో డానీ ఓల్మో, 21వ నిమిషంలో  మార్కో అసెన్సియో, 31వ నిమిషంలో  ఫెర్నార్‌ టోరెస్‌ గోల్స్ సాధించారు. 

ఖాతా తెరవలేదు..
సెకండాఫ్నూ స్పెయిన్ అదే జోరును కొనసాగించింది. కోస్టారికా గోల్ పోస్టులపై దాడులు కొనసాగించింది. ఆధిక్యంలో ఉన్నా  కూడా ఆ జట్టు ఎక్కడా తగ్గలేదు. రెండో భాగంగా ఏకంగా నాలుగు గోల్స్ సాధించింది. 54వ నిమిషంలో మార్కో అసెన్సియో మరోసారి గోల్ కొట్టాడు.  ఆ తర్వాత 74వ నిమిషంలో గవి గోల్తో స్పెయిన్ ఆధిక్యం  5–0కు చేరుకుంది. 90వ నిమిషంలో  కార్లోస్‌ సోలర్‌,  అల్వరో మొరాట గోల్స్ వేయడంతో...స్పెయిన్  7–0తో మ్యాచ్లో విజయం సాధించింది. ఓవైపు స్పెయిన్ గోల్స్ సాధిస్తున్నా..కోస్టారికా మాత్రం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.