ఇండియన్ ఓపెన్ విన్నర్స్ శాంటియాగో బెల్మాంట్

ఇండియన్ ఓపెన్ విన్నర్స్ శాంటియాగో బెల్మాంట్

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఓపెన్ పాడెల్ టోర్నమెంట్‌‌‌‌లో స్పెయిన్ ప్లేయర్లు మెన్స్‌‌‌‌, విమెన్స్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.  హైదరాబాద్‌‌‌‌లో ఆదివారం జరిగిన  మెన్స్ ఫైనల్లో నాలుగో సీడ్  ఫిగెరోలా శాంటియాగో –- బెల్మాంట్ పాస్టర్ 6-–3, 7–-5 తేడాతో వరుస సెట్లలో మెలేరో బెర్నాల్– జురిటాపై విజయం సాధించారు. విమెన్స్ ఫైనల్లో టాప్ సీడ్ జోడీ  మాన్క్విలో అలార్జా–-- లుజాన్ రోడ్రిగ్జ్  6--–3, 4--–6, 6-–-1 తేడాతో  ఎం. కోయెక్-- వి. కుర్జ్‌‌‌‌పై గెలిచింది. బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌‌‌‌, రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్‌‌‌‌ విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.