చిన్నపిల్లాడిలా మారిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

చిన్నపిల్లాడిలా మారిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిల్లలంటే ఇష్టం. ఎక్కడయినా చిన్నారులు కనిపిస్తే చాలు వెంటనే  కాన్వాయ్ ఆపి.. వారితో కలిసిపోయి సరదాగా గడుపుతారు. తన హోదాను పక్కనపెట్టి చిన్న పిల్లాడిలా మారిపోతారు. తాజాగా పిల్లలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గోటీలు ఆడుతూ సరదాగా గడిపారు. నిత్యం వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండే  పోచారం కాసేపు చిన్న పిల్లలతో కలిసి గోటీలు ఆడడం అందరినీ ఆకట్టుకుంది.

ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నియోజకవర్గం బాన్సువాడలో పర్యటించారు. నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామంలో పర్యటిస్తుండగా మార్గమధ్యలో చిన్నారులు గోటీలు ఆడుతూ కనిపించారు. ఇంకేముంది స్పీకర్ లోని చిన్నపిల్లాడు మేల్కొన్నారు. వెంటనే తన కారుని ఆపి చిన్నారులతో సరదాగా గోటీలు ఆడారు. గోటీలు తీసుకుని వేటిని కొట్టాలంటూ పిల్లాడిని అడిగాడు. పిల్లాడు సూచించిన గోటీలను కొట్టే ప్రయత్నం చేశారు.