- సమస్యలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నంబర్లు ఇవే..
నిర్మల్, వెలుగు: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే ప్రజలు తమను సంప్రదించవచ్చని నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానం గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో తాము అందుబాటులో ఉంటామని, ఎన్నికలపై ఫిర్యాదులను ఇవ్వాలనుకున్నవారు నేరుగా సంప్రదించి, ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. లేదా 9959284786 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. Observerpnirmal @gmail.com మెయిల్ ఐడి ద్వారానైనా ఫిర్యాదులు తెలియజేవచ్చన్నారు.
మీడియా సెంటర్ ప్రారంభం
ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్లో మీడియా సెంటర్ ను గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి.శ్రీనివాస్, వ్యయ పరిశీలకురాలు బి.స్వప్న, అడిషనల్ కలెక్టర్ డేవిడ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల ద్వారా పత్రికలు, టీవీల్లో వచ్చే చెల్లింపు వార్తలు, కథనాలు, ప్రకటనలపై, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెడతామన్నారు. సమాచారం, ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్8500844365లో సంప్రదించవచ్చన్నారు.
మంచిర్యాలలో 08736- 250501
నస్పూర్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలను ప్రలోభపెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర అంశాలపై నిఘా ఉంటుందని తెలిపారు. ఈ అంశాలు ఎవరి దృష్టికైనా వస్తే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్08736- 250501లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇతర ఎన్నికల సంబంధిత సమాచారం కోసం కాల్ చేయవచ్చని తెలిపారు.
