సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం

సినిమాల్లో నారదుడి పాత్రను వక్రీకరించడం బాధాకరం
  • లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని విస్తృతం చేసిన గొప్ప మహర్షి నారదుడు

హైదరాబాద్: లోక కళ్యాణం, ధర్మ రక్షణ కోసం సమాచార రంగాన్ని విస్తృతం చేసిన గొప్ప మహర్షి నారదుడు అని శాంత బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి అన్నారు.  కొన్ని సినిమాల్లో నారదుడు లాంటి పాత్రలను వక్రీకరించడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. 
సమాచార భారతి అధ్వర్యంలో నారద జయంతి, ప్రపంచ పత్రిక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులకు విశిష్ఠ సేవ పురస్కారాలు అందించారు వరపస్రాద్ రెడ్డి, సమాచార భారతి ఉపాధ్యాక్షులు వల్లీశ్వర్. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజం మారాల్సిన అవసరం ఉందన్నారు వరపస్రాద్ రెడ్డి. కొత్తగా వస్తున్న జర్నలిస్టుల కోసం ప్రత్యేక కోర్సులు రావాలన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

బోస్టన్లో 'జై భీమ్‌' కు అవార్డుల పంట

గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు