కొత్త పార్లమెంట్.. ఉద్యోగులకు కొత్త యూనిఫాం..

కొత్త పార్లమెంట్.. ఉద్యోగులకు కొత్త యూనిఫాం..

పార్లమెంట్ మాత్రమే కొత్తది కాదు.. మిగతా అన్ని విషయాలు కూడా కొత్తగా ఉండనున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి సైతం కొత్త యూనిఫాం అమల్లోకి తెస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కొత్త యూనిఫాం సెలక్ట్ చేసింది. కాకపోతే ఇవి సంప్రదాయ భారతీయ రంగుల్లో.. డిజైన్స్ లో ఉండటం విశేషం. కొత్త పార్లమెంట్ లో ఉద్యోగుల కొత్త యూనిఫాం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యి్ంది. రెండు రంగుల్లో ఉన్నాయి ఈ దుస్తులు. ఒకటి కాషాయ రంగులో ఉండగా.. మరొకటి లైట్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. పూల డిజైన్ ఉంది.

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక సమావేశాల కోసం వచ్చే వారం కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్లే సమయంలో పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫారాలు ధరించనున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల కోసం కొత్త పార్లమెంట్ భవనానికి వచ్చే పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫారాలు ధరించనున్నారు. ఈ యూనిఫామ్‌లో 'నెహ్రూ జాకెట్లు', ఖాకీ-రంగు ప్యాంటు ఇతర మార్పులతో పాటు ఇండియన్ టచ్ ను కూడా ఇచ్చారు.

సెప్టెంబర్ 18న సమావేశాలు ప్రారంభం కాగా, గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబరు 19న 'పూజ' అనంతరం కొత్త పార్లమెంటు భవనంలోకి లాంఛనంగా ప్రవేశం ఉంటుంది. ఇక ఈ యూనిఫాం విషయానికొస్తే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) దీన్ని రూపొందించింది. ఈ చొక్కాలు లోటస్ ఫ్లవర్ డిజైన్‌తో గులాబీ రంగులో ఉంటాయి.

ఉభయ సభల్లోని మార్షల్స్ దుస్తులు కూడా మార్చారు. వారు మణిపురి తలపాగాలు ధరించనున్నారు. పార్లమెంట్ భవనంలో భద్రతా సిబ్బంది దుస్తులను కూడా మార్చనున్నారు. వీరికి సఫారీ సూట్‌లకు బదులుగా, మిలటరీ తరహాలో దుస్తులు ఇవ్వబడతాయి.