
ఇటీవల ప్రతినిథి2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా రోహిత్.. ప్రస్తుతం ‘సుందరకాండ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విర్తి వాఘని హీరోయిన్. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ.. కూల్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు నారా రోహిత్. ‘ఏ రెండు ప్రేమకథలు ఒకేలా ఉండవు’ అని పోస్టర్‌పై రాసుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులోని ప్రేమకథ కొత్తగా ఉంటుందని, త్వరలోనే టీజర్ విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.