
ఆమనగల్లు, వెలుగు : భక్తిభావంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కడ్తాల్ మండలం న్యామతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతానరసింహ, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ నాయక్, గోపాల్, విఠలయ్యగౌడ్, బిచ్చ నాయక్, రామకృష్ణ పాల్గొన్నారు.