మొబైల్ కోసం స్పెషల్​ శానిటైజర్​ బాక్స్

V6 Velugu Posted on Jun 22, 2021

రోజంతా చేతిలో ఉంటుంది ఫోన్. అలా అని మాటిమాటికి ​దాన్ని శానిటైజ్​ చేయాలంటే విసుగొచ్చేస్తుంది. అలా కాకుండా దాన్ని ఒక బాక్స్​లో​ పెడితే అదే శానిటైజ్​ చేసేస్తుందట. అదెలాగంటే.. ఆ బాక్స్​ లోపల పై భాగాన యూవీ లైట్ పడేలా అమర్చారు. దానివల్ల యూవీ స్టెరిలైజర్ ఫోన్​ మీదున్న క్రిముల్ని చంపేస్తుంది. లైట్ ఎనిమిది నిమిషాల తర్వాత దానంతటదే ఆగిపోతుంది. దీన్ని అరోమా థెరపీ ఫంక్షన్​ అంటారు. 
ఫోన్​కే కాదు...
మొబైల్​ చార్జింగ్ పెట్టినప్పుడు కూడా​ ఇందులో పెట్టొచ్చు. ఈ మొబైల్​ బాక్స్​లు ఫోన్​కే కాదు, ఐపాడ్స్​,  బ్లూటూత్​, ఇయర్​ఫోన్స్, వాచీలు, పిల్లల ఆట వస్తువులు, ఫోర్క్, నైఫ్, కళ్లద్దాలు, తాళం చెవి, జువెలరీ, మేకప్​కు సంబంధించిన వస్తువులు వంటివి ఏవైనా ఇందులో పెట్టొచ్చు. బర్త్​డే, ఫెస్టివల్స్​ నాడు గిఫ్ట్​గా కూడా ఇవ్వొచ్చు.  

Tagged , Mobile Sanitizer Box

Latest Videos

Subscribe Now

More News