మెగా ప్రిన్స్ క్లీంకారపై సాంగ్.. ఉపాసన చేతులమీదుగా విడుదల

మెగా ప్రిన్స్ క్లీంకారపై సాంగ్.. ఉపాసన చేతులమీదుగా విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతులు దాదాపు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా  2023 జూన్ 20 మెగా కుటుంబంలోకి క్లీంకార(Klin Kaara) అడుగుపెట్టారు. వారసురాలి రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీ గా ఫీలయ్యారు. ఇక క్లీంకార మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టి దాదాపు ఏడూ నెలలు గడుస్తున్నా.. ఆమె ఫేస్ ని రివీల్ చేయలేదు. ఆమె ఎలా ఉందొ తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీలో స్టార్స్ పుట్టినరోజుకి వారిపై పాటలు రిలీజ్ చేయడం మామూలే. అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై చాలా పాటలే వచ్చాయి. ఇక తాజాగా మెగా ప్రిన్స్ క్లీంకారపై పాటను రిలీజ్ చేశారు మెగా ఫ్యాన్స్. ఈ పాటని సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.