వానల కోసం నూటొక్క కాడెద్దులతో..  వెయ్యి పదహారు బిందెలతో..

వానల కోసం నూటొక్క కాడెద్దులతో..  వెయ్యి పదహారు బిందెలతో..
  • నూటొక్క కాడెద్దులతో..  వెయ్యి పదహారు బిందెలతో..
  • వానల కోసం పూజలు

మానవపాడు, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం  పల్లెపాడులో వానల కోసం నూటొక్క కాడెద్దులతో... వెయ్యిపదహారు బిందెలతో.. కృష్ణానది నీటిని తెచ్చి ఆంజనేయస్వామికి అభిషేకం చేశారు. నెల రోజుల నుంచి వానలు పడకపోవడంతో పంటలు వాడిపోతున్నాయి. దాంతో నూటొక్క కాడెద్దులతో అందరూ కదిలివచ్చారు. కృష్ణానది దగ్గరకు చేరుకుని వెయ్యిపదహారు బిందెలలో కృష్ణా నీళ్లను తెచ్చి స్థానిక ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు.  కృష్ణమ్మ  ఒడ్డున చేరి వానలకోసం ప్రార్ధిస్తామని,  వర్షం కురిస్తే మళ్లీ కృష్ణమ్మకు నదీ హారతి ఇచ్చి, అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామన్నారు.