స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 217 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పోస్టులు: మేనేజర్: 2, డిప్యూటీ మేనేజర్: 44, అసిస్టెంట్ మేనేజర్: 136, అసిస్టెంట్ వీపీ: 19, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్: 1, సీనియర్ ఎగ్జిక్యూటివ్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో మే 19 వరకు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించి (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష జూన్లో నిర్వహిస్తారు. వివరాల కోసం www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.