హైదరాబాద్ లో షాపింగ్ మాల్లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్ లో  షాపింగ్ మాల్లోకి దూసుకెళ్లిన కారు
  • తప్పిన ప్రాణనష్టం
  •     పేట్​బషీరాబాద్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: పేట్​బషీరాబాద్​పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి.. ఫ్యాషన్ సిటీ షాపింగ్ మాల్​లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపింగ్​మాల్​అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.