రికార్డు స్థాయికి క్రెడిట్​కార్డుల వాడకం

రికార్డు స్థాయికి క్రెడిట్​కార్డుల వాడకం
  • రికార్డు స్థాయికి క్రెడిట్​కార్డుల వాడకం
  • మే నెలలో ట్రాన్సాక్షన్ల విలువ రూ. 1.4 లక్షల కోట్లుగా నమోదు
  • వాడకంలో 8.74 కోట్ల కార్డులు 

ముంబై : క్రెడిట్ కార్టులతో చేసే ఖర్చు మే నెలలో రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 8.74 కోట్ల మందికిపైగా కార్డులు వాడుతున్నారని ఆర్​బీఐ తాజా లెక్కలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బకాయిలు ఈ ఏడాది మే నెలలో వార్షికంగా 5 శాతం పెరిగాయి.  కార్డుల సంఖ్య కూడా జనవరి నుంచి 5 మిలియన్లకు పైగా పెరిగింది.  రిపోర్టింగ్ నెలలో ఇది 8.74 కోట్లని దాటింది. ఇన్ని కార్డుల నుంచి లావాదేవీలు జరగడం ఇదే మొదటిసారని ఆర్​బీఐ డేటా పేర్కొంది.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే 2 మిలియన్ల మంది కార్డులను తీసుకున్నారు.  ఈ ఏడాది జనవరి నాటికి 82.4 మిలియన్ యాక్టివ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఫిబ్రవరిలో 83.3 మిలియన్లకు, మార్చిలో 85.3 మిలియన్లకు,  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 86.5 మిలియన్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరం అంతటా క్రెడిట్ కార్డ్ ఖర్చులు రూ. 1.1–-1.2 లక్షల కోట్ల పరిధిలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది మేలో ఇవి రూ. 1.4 లక్షల కోట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సగటు ఖర్చు రూ. 16,144లకు చేరుకుందని, ఇది కూడా ఆల్​టైం హై అని ఆర్​బీఐ తెలిపింది. 

హెచ్​డీఎఫ్​సీ.. నంబర్​వన్​

మార్కెట్ లీడర్ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​కు అత్యధికంగా 18.12 మిలియన్ల కార్డులు ఉన్నాయి. మొత్తం బకాయిల్లో దీని వాటా 28.5 శాతం వరకు ఉంది. ఎస్​బీఐ  కార్డ్ 17.13 మిలియన్ కార్డులతో రెండవ స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 14.67 మిలియన్​కార్డులతో రెండవ స్థానంలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ 12.46 మిలియన్లతో నాలుగో అతిపెద్ద బ్యాంక్​గా నిలిచింది. ఇది  సిటీ రిటైల్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోను ఇటీవల స్వాధీనం చేసుకోవడంతో కార్డుల సంఖ్యను విపరీతంగా పెంచుకోగలిగింది. 2022లో యాక్సిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రిటైల్ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోకు విక్రయించినప్పుడు సిటీకి 1,62,150 మంది యాక్టివ్ కార్డ్ యూజర్లు ఉన్నారు. 

ALSO READ :కాంగ్రెస్​ కేడర్​పై గులాబీ గురి

తాజా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూనియన్ సిబిల్ రిపోర్ట్​ ప్రకారం, బ్యాంకుల క్రెడిట్ కార్డ్ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో డెలిక్వెన్సీలు పెరుగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో ఆలస్యం, బకాయిల ఎగవేత వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి  2023 మార్చిలో 66 బేసిస్ పాయింట్లు పెరిగి 2.94 శాతానికి చేరుకున్నాయి.  అయితే క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పర్సనల్​లోన్లకు డిమాండ్​ విపరీతంగా పెరుగుతోంది.  మూడు నెలలు దాటినా బకాయిలు చెల్లించని కార్డుదారుల సంఖ్య 2.94 శాతం వరకు ఉంది. అసెట్​ క్వాలిటీ వార్షికంగా 0.66 శాతం పెరిగింది. వ్యక్తిగత అప్పుల విషయంలో అసెట్​క్వాలిటీ 0.04 శాతం నుంచి 0.94 శాతానికి పెరిగిందని సిబిల్ తెలిపింది.