స్ఫూర్తి కలిగించిందామె...

స్ఫూర్తి కలిగించిందామె...

ప్యాండెమిక్ వల్ల చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఉన్న ఉద్యోగాలకి కుటుంబ బాధ్యతలు అడ్డుపడ్డాయి. భర్త, పిల్లల బాగోగుల్లో పడి చాలా మంది ఆడవాళ్లు ఉద్యోగాలు వదిలేశారు. అలాంటి వాళ్లను మళ్లీ ఉద్యోగాల వైపు నడిపిస్తోంది స్ఫూర్తి. ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఫేస్​బుక్​ సీవోవో షెర్లీ శాండ్​బెర్గ్ రీసెంట్​గా ఇన్​​స్టాగ్రామ్​లో ఓ పోస్ట్ పెట్టింది. స్ఫూర్తి బెంగుళూరులో లీన్​ ఇన్​ అనే​సంస్థలో నెట్​వర్క్ లీడర్​గా పనిచేస్తోంది. ప్యాండెమిక్​ వల్ల వాళ్ల కమ్యూనిటీలో చాలామంది ఆడవాళ్లు ఉద్యోగాలకు రిజైన్ చేశారు. వాళ్లను తిరిగి పనిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది స్ఫూర్తి. ఆ ఆడవాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ‘ఆడవాళ్లు బయటికి రావాలి. మగవాళ్లు అందుకు అండగా నిలవాలి. వర్క్​ని ఈక్వల్​గా పంచుకోవాలి’ అని చెప్తూ అందర్నీ కన్వీన్స్ చేసింది. స్ఫూర్తి చొరవతో ఇప్పుడు ఆ కమ్యూనిటీలోని ఆడవాళ్లంతా తిరిగి పనుల్లో చేరారు. కుటుంబసభ్యులు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండడంతో ఇంటి, ఆఫీస్​ పనుల్ని బ్యాలెన్స్ చేయడం కష్టమనిపించట్లేదు వాళ్లకిప్పుడు. ఆ విషయం కాస్తా షెర్లీ చెవిన పడడంతో ఆమె స్ఫూర్తిని  అభినందిస్తూ  పోస్ట్ పెట్టింది. ప్రత్యేకంగా ఆమెను కలిసింది కూడా. ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే బాగా వైరల్​ అయ్యింది. దాంతో చాలామంది స్ఫూర్తిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుంటున్నామని చెబుతున్నారు.