స్పైస్‌ 2000 బాంబులను కొనుగోలు చేయనున్నIAF

స్పైస్‌ 2000 బాంబులను కొనుగోలు చేయనున్నIAF

శత్రువుల స్థావరాలను, బంకర్‌లను ధ్వంసం చేసే స్పైస్‌ 2000 అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌ బాంబులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇటీవల పాక్‌ స్థావరాలపై IAF వదిలిన బాంబులు ఇవే. స్పైస్‌ 2000 బాంబులు, కాంక్రీట్‌ రూఫ్‌ టాప్‌లను కూడా చేధించి..బిల్డింగ్‌లను పూర్తిగా ధ్వంసం చేయగలవు. బిల్డింగ్‌ డెస్ట్రాయర్‌ , బంకర్‌ బస్టర్‌ గా పిలువబడే మార్క్‌ 84 వర్షన్‌ బాంబులను కొనేందుకు వైమానిక దళం ఇంట్రెస్టు చూపిస్తోంది. అత్యవసర అధికారాలను వినియోగించుకుని సుమారు మూడు వందల కోట్ల విలువైన బాంబులను కొనుగోలు చేయాలని IAF అధికారులు భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌ నుంచి ఈ బాంబులను ఖరీదు చేయనున్నారు.