ఓ సీఐఎస్ ఎఫ్ జవాను చెంప చెల్లుమనిపించింది స్పేస్ జెట్ లేడీ ఎంప్లాయి ఈ షాకింగ్ ఘటన జైపూర్ ఎయిర్ పోర్టులో జరిగింది.ఎయిర్ పోర్టులో విధులు నిర్వహిస్తు న్న సీఐఎస్ ఎఫ్ జవాన్ కు స్పేస్ జెట్ లో పనిచేస్తున్న లేడీ ఎంప్లాయి కి మధ్య వాగ్వాదం కాస్త ముదిరి..జవాన్ చెంప దెబ్బ కొట్టేందుకు దారితీసింది. ఇదంతా చూస్తు న్న ఓ ప్రయాణికుడు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది.
జవాన్ పై చేయి చేసుకున్న ఎంప్లాయీని అనురాధ రాని గా గుర్తించారు. ఈమె స్పేస్ జెట్ ఎయిర్ లైన్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తుంది. ఎయిర్ పోర్టులో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న గిరిరాజ్ ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం తో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. గిరిరాజ్ ఆమెకు సర్దిచెప్పేలోపే చెంపపై కొట్టింది . అయితే ఈ ఘటనతో రెచ్చిపోకుండా సీఐఎస్ ఎఫ్ జవాన్ సంయమనం పాటించాడు. ఇంతలో ఓ మహిళా సెక్యూరిటీ గార్డు అనురాధను పక్కకు తీసుకెళ్లి కూల్ చేశారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున 4 గంటలకు జరిగింది. ఈ ఘటనలో మహిళ అనురాధను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనపై CISF అధికారులు ఏమన్నారంటే..
జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ లైన్ సిబ్బందికోసం తప్పని సరిగా ఎంట్రీ గేట్ వద్ద స్ర్కీనింగ్ చేయాల్సి ఉంటుంది. డ్యూటీలో భాగంగానే స్పైస్ జెట్ మహిళా ఉద్యోగిని కూడా సీఐఎస్ ఎఫ్ తనిఖీచేశారు. ఆ టైంలో మహిళా సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరు.. మహిళా ఉద్యోగి రెచ్చిపోయి విధుల్లో ఉన్న సీఐఎస్ ఎఫ్ సిబ్బందిని చెంపదెబ్బ కొట్టారని సీఐఎస్ ఎఫ్ అధికారులు అన్నారు.
స్పైస్ జెట్ అథారిటీ ఏమన్నారంటే..
ఈ ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్ లైన్ వాదన మరోలా ఉంది. స్పైస్ జెట్ మహిళా ఉద్యోగిని పురుష సీఐఎస్ ఎఫ్ జవాన్ తనిఖీ చేయడం దురదృష్ఠకరం.. స్టీల్ గేట్ వద్ద క్యాటరింగ్ వాహనాన్ని ఎస్కార్ట్ చేస్తున్నపుడు విమానాశ్రయంలోకి వెళ్లేందుకు పాస్ ఉన్నప్పటికీ సీఐఎస్ ఎఫ్ సిబ్బంది తమ ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరిం చిందని ..తమ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు గురి చేశారని చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని స్పైస్ జెట్ ప్రకటనలో తెలిపింది.
SpiceJet employee slaps CISF man in argument over security check at Jaipur airport arrested..
— RTV (@RTVnewsnetwork) July 11, 2024
Jaipur, Jul 11 A SpiceJet staff member was arrested Thursday after she allegedly slapped a Central Industrial Security Force jawan during an argument over security screening, police and… pic.twitter.com/RjmnfcNawz