V6 News

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్ జెట్ విమానం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్ జెట్ విమానం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎయిర్ పోర్టులోని రన్ వే పై నిలిచి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొన్నది. ఇలాంటి ఘటన జరగటం చాలా చాలా అరుదు. ఓ విమానం.. మరో విమానం మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. అలాంటిది.. నిలిచి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొనటం సంచలనంగా చర్చనీయాంశం అయ్యింది.

ఎయిర్ పోర్టు రన్ వేపై.. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం వెళుతుంది. ఇలా వెళుతున్న క్రమంలో.. రన్ వేపై అప్పటికే అక్కడ నిలిచి ఉన్న ఆకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో స్సైస్ జెట్ విమానం కుడి వైపు ఉన్న రెక్క దెబ్బతిన్నది. ఇదే సమయంలో ఆకాసా ఎయిర్ ఫ్లయిట్ ఎడమ వైపు రెక్క దెబ్బతిన్నది. 

స్పైస్ జెట్ విమానం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆకాసా ఎయిర్ విమానాన్ని భద్రతా తనిఖీల్లో భాగంగా నిలిపివేశారు. 

ఈ ఘటన తర్వాత ఆకాసా ఎయిర్ ప్రతినిధి స్పందించారు. మా విమానం ప్రయాణికుల కోసం సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులను మరో విమానంలో తరలించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారాయన. 

►ALSO READ | ఎంత బలుపు, కొవ్వెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతాడు: షాకింగ్ గా TCS బాధితుడి కంప్లయింట్..!

ఈ ఘటనపై స్పైస్ జెట్ ప్రతినిధి కూడా మాట్లాడారు. విమానాన్ని ట్యాక్సియింగ్ చేస్తుండగా.. గ్రౌండ్ యాక్సిడెంట్ జరిగిందని.. దీని వల్ల స్పైస్ జెట్ విమానం రైట్ సైడ్ వింగ్ లెట్ దెబ్బతిన్నదని.. ఆకాసా ఎయిర్ విమానం ఎడమ వైపుహారిజాంటల్ స్టెబిలైజర్ దెబ్బన్నట్లు వెల్లడించారు. 

దెబ్బతిన్న రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. ఆయా విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణిలకు మరో విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

నిత్యం రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ఘటన జరగటంపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.