1,400 మందిని తీసేసిన స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌

1,400 మందిని తీసేసిన స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌
  •  ఖర్చులు తగ్గించుకునేందుకే 

న్యూఢిల్లీ: స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌ 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. అప్పులతో ఇబ్బందుల్లో ఉన్న ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్ కంపెనీ తన వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో 15 శాతం మందిని ఇంటికి పంపించేసింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లేఆఫ్స్ చేపట్టామని కంపెనీ చెబుతోంది.  ఉద్యోగులను తగ్గించుకోక తప్పడం లేదని, శాలరీ బిల్లే రూ.60 కోట్లు వస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్ కొన్ని నెలల నుంచి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని, జనవరి నెల శాలరీ ఇంకా పడలేదని టెర్మినేషన్ లెటర్ అందుకున్న ఓ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 

స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్ రూ.2,200 కోట్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌ పొందగా, ఇవి అందడానికి టైమ్ పట్టేటట్టు కనిపిస్తోంది. ‘ఫండింగ్ అందడంలో ఎటువంటి సమస్యలు లేవు. ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ సజావుగానే జరుగుతోంది. ఇప్పటికే పబ్లిక్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా చేశాం’ అని  కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై త్వరలో మరో అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తామని  చెప్పారు.  స్పైస్‌‌‌‌‌‌‌‌జెట్‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు అంటే 2019 లో  118 విమానాలను ఆపరేట్ చేసింది. కంపెనీ ఉద్యోగులు 16,000 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ 30  విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఉద్యోగులు 9 వేలకు తగ్గిపోయారు.