Karthikamasam special 2025:నంది చెవిలో భక్తుల కోర్కెలు చెప్పే శివ భక్తులు .. పాటించాల్సిన నియమాలు ఇవే..!

Karthikamasam special 2025:నంది చెవిలో భక్తుల కోర్కెలు చెప్పే శివ భక్తులు .. పాటించాల్సిన నియమాలు ఇవే..!

 కార్తీకమాసం కొనసాగుతుంది.  తెలుగురాష్ట్రాల్లో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.. ఓ పక్క దీపారాధానలు..  మరో పక్క పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు.  శివాలయాల్లో స్వామి వారికి ఎదురుగా ఉండే నందీశ్వరుడికి చాలా ప్రత్యేకత ఉంది.  భక్తులు తమ కోర్కెలను తీర్చాలని శివుడికి ఎదరుగా కూర్చొన్న నంది చెవిలో  చెబుతారు.   మరి పరమేశ్వరుడికి ఎలా చేరతాయి..  నంది చెవిలో చెప్పేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

 హిందూ మతంలో శివ ప్రథమ గణాల్లో నందీశ్వరుడికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. నంది శివుడి వాహనం గా చెబుతుంటారు. ఏ శివాలయాల్లో కి వెళ్ళినా సరే కచ్చితంగా నంది ఉంటుంది. అది కూడా శివుడికి ముందుగా ఉంటుంది. శివుడికి ఎదురుగా ఉంటూ శివుని కంటే ముందు నంది కనిపిస్తుంది.

 శివునికి అభిముఖంగా నంది విగ్రహం దర్శనం అవుతుంది. నందిని శివునికి ఇష్టమైనదిగా చెబుతుంటారు పండితులు. శివయ్యకు సేవ చేయడానికి నంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అంతేకాదు శివుని ద్వారపాలకుడిగా నంది శివుని సేవిస్తాడని నమ్ముతుంటారు. అందుకనే ఎవరైనా భక్తులు తమ కోరికను నంది చెవిలో చెప్పాలి. ఇలా చెబితే నేరుగా శివునికి చేరుతుందని చాలా మంది విశ్వసిస్తారు కూడా.

 నంది చెవిలో కోరికలు చెప్పడం అనేది ఇప్పటి సంప్రదాయం మాత్రమే కాదు పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఈ సంప్రదాయం వెనుక ఒక ప్రత్యేక కారణం కూడా దాగి ఉంది అంటున్నారు పండితులు. 


 శివపురాణం ప్రకారం  నందిని శివుని అవతారంగా తెలిపారు. అందుకు ప్రతి శివాలయం బయట నంది విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. నంది లేని శివాలయం ఉండదు. శివాలయానికి వచ్చినప్పుడల్లా నంది చెవిలో తన కోరిక చెప్పుకోవాలి అంటారు పండితులు. ఇలా చేయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంటుందట.

మహాదేవుడు తపస్వి, ఎల్లప్పుడూ ధ్యానంలో  ఉంటాడు.  అందుకే మన మాటలు నేరుగా ఆయనకు చేరవట. శివుడి ధ్యానం పూర్తయిన తరువాత నందే ఆ కోరికలు మొత్తం శివుడికి చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నంది శివుని గణాధ్యక్షుడు, శివుని అవతారంగా కూడా నమ్ముతుంటారు. మహాదేవుడు తన చెవిలో చెప్పిన కోరికలను త్వరగా ఆలకిస్తాడని.. భక్తుల సమస్యలు తీరుస్తాడని నమ్మకం. మరి మీరు కూడా ఈ సారి శివాలయానికి వెళ్తే ఆ శివయ్య ముందు మీ కోరికలు చెప్పే కంటే ముందు ఆ నందీశ్వరుడితో కూడా ఓ సారి మీ కోరికలు విన్నవించుకోండి.

ఎలా మీ కోరికలు చెప్పాలంటే?

  • ముందుగా శివుడిని, పార్వతిని పూజించాలి. దీని తరువాత నందికి నీరు, పువ్వులు, పాలు అర్పించాలి. ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించి నందికి హరతి ఇవ్వాలి.
  • నందీశ్వరుడికి ఏ చెవిలోనైనా మీ కోరికలు చెప్పుకోవచ్చు. అయితే ఎడమ చెవిలో కోరికలు చెబితే మంచి ఫలితాలు లభిస్తాయి.
  • నంది చెవిలో మీ కోరికను చెప్పే ముందు, “ఓం” అనే పదాన్ని పలకండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు శివునికి త్వరగా చేరుతాయి అంటున్నారు పండితులు.
  • నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు చెప్పే ఏ కోరిక కూడా ఇతరులు వినకూడదు. లేదంటే మీ కోరిక నెరవేరడం నెమ్మది కావచ్చు.
  • కోరికను చెప్పేటప్పుడు చేతులతో మీ పెదవులను క్లోజ్ చేసుకోవాలి. దీని వల్ల మీ కోరికను చెబుతున్న సమయమలో ఇతర వ్యక్తులకు ఆ కోరిక తెలియదు.
  • మీ కోరిక చెప్పిన తర్వాత నందీశ్వర మా కోరిక తీర్చు అని విజ్ఞప్తి చేయండి. ఒక సమయంలో ఒక కోరిక మాత్రమే చెప్పండి. అత్యాశకు పోయి కోరికల లైన్ పెట్టవద్దని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.