మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?:   ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా?:   ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి

జమ్మికుంట, వెలుగు: రైతులకు మూడు పంటలు కావాలా... మూడు గంటలు కావాలా.. మతం పేరిట మాటలు కావాలో హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్ట శక్తులు ఎన్ని వచ్చినా రైతులను కాపాడుకునే నాయకుడు సీఎం కేసీఆర్​ ఉన్నారన్నారు. రాష్ట్రంలో కరెంట్​పై రేవంత్‌రెడ్డి కామెంట్లను నిరసిస్తూ సోమవారం వివిధ గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. గతంలో రైతులు రాత్రుళ్లు కరెంట్​కోసం బాయిల కాడ పడుకున్న రోజులు చూసినమని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని రైతులు ఆలోచించాలన్నారు.  హుజూరాబాద్ లో కౌశిక్‌రెడ్డి గెలుస్తాడన్న సర్వే రిపోర్టులతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. తనకు ఒక్క చాన్స్​ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌‌పర్సన్​కనుమల్ల విజయ, ఎంపీపీ పావని, రమేశ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

ALSO READ :హుజూరాబాద్‌లో మున్సిపల్​ స్థలం కబ్జా 

 

వ్యవసాయాన్ని పండుగ చేశాం

జగిత్యాల టౌన్ : వ్యవసాయాన్ని దండగ అన్న దగ్గరి నుంచి పండగలా మార్చామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో రైతు వేదిక వద్ద జడ్పీ చైర్మన్ వసంతతో కలిసి ఎమ్మెల్యే రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాధ, ప్యాక్స్​చైర్మన్​ మహిపాల్ రెడ్డి, లీడర్లు రవీందర్ రెడ్డి, బాల ముకుందం పాల్గొన్నారు.