క్రీడా పురస్కారాలు..హుస్సాముద్దీన్‌‌‌‌కు అర్జున

క్రీడా పురస్కారాలు..హుస్సాముద్దీన్‌‌‌‌కు అర్జున
  •     ఖేల్‌‌‌‌రత్నకు సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌
     

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌.. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోనున్నాడు.  బ్యాడ్మింటన్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్లేయర్లు సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌, చిరాగ్‌‌‌‌ షెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌‌‌‌చంద్‌‌‌‌ ఖేల్‌‌‌‌రత్న అవార్డు రేసులో నిలిచారు.

ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ ఈ ఇద్దరిని ఖేల్‌రత్నకు,19 మందిని అర్జున కోసం సిఫారసు చేసింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ షమీని చివరి నిమిషంలో అర్జున అవార్డుల లిస్ట్‌లో చేర్చింది. వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌ల్లోనే 24 వికెట్లు తీయడంతో షమీ పేరును క్రికెట్‌‌‌‌ బోర్డు ప్రత్యేకంగా ప్రతిపాదించింది. 

అర్జున అవార్డు నామినీలు: హుస్సామ్ (బాక్సింగ్), షమీ (క్రికెట్), అజయ్‌‌‌‌ రెడ్డి (బ్లైండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌), దియోతలే, అదితి (ఆర్చరీ), శీతల్‌‌‌‌ (పారా అర్చరీ), పారుల్‌‌‌‌, శ్రీశంకర్‌‌‌‌ (అథ్లెటిక్స్‌‌‌‌), ఆర్‌‌‌‌. వైశాలి (చెస్‌‌‌‌), దివ్యాకృతి, అనూష (ఈక్వెస్ట్రియాన్‌‌‌‌), దీక్ష ‌‌‌‌ (గోల్ఫ్‌‌‌‌), కృష్ణ పాఠక్‌‌‌‌, సుశీల (హాకీ), పింకీ (లాన్‌‌‌‌ బాల్‌‌‌‌), ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌(షూటింగ్‌‌‌‌), అంతిమ్‌‌‌‌ (రెజ్లింగ్‌‌‌‌), ఐహికా (టీటీ),  రోషిబినా(ఉషు)

ధ్యాన్ చంద్ లైఫ్​ టైమ్: కవిత (కబడ్డీ), మంజుషా (బ్యాడ్మింటన్‌‌‌‌), వినీత్‌‌‌‌ (హాకీ).
 

ద్రోణాచార్య: గణేశ్‌‌‌‌ (మల్లకాంబ్‌‌‌‌), మహావీర్‌‌‌‌ సైనీ (పారా అథ్లెటిక్స్‌‌‌‌), లలిత్‌‌‌‌ కుమార్‌‌‌‌ (రెజ్లింగ్‌‌‌‌), ఆర్‌‌‌‌.బి. రమేశ్‌‌‌‌ (చెస్‌‌‌‌), శివేంద్ర సింగ్‌‌‌‌ (హాకీ).
 

ఖేల్ రత్న: సాత్విక్–చిరాగ్ (బ్యాడ్మింటన్​).