హైదరాబాద్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌ హ్యాకథాన్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌ హ్యాకథాన్‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌‌‌‌లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌‌‌‌ హ్యాకథాన్‌‌‌‌ ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్‌‌‌‌ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ అసోసియేషన్‌‌‌‌ (టీఐటీఏ) నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్‌‌‌‌ శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌, ఫెన్సింగ్‌‌‌‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌‌‌‌, పవర్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌, అథ్లెటిక్స్‌‌‌‌తో పాటు మొత్తం 24 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని టీఐటీఏ అధ్యక్షుడు మక్తాల సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌  చెప్పారు.

క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌, శారీరక, సాంకేతిక సమస్యలను విశ్లేషిస్తూ వాటికి టెక్నాలజీ ఎలాంటి పరిష్కారం చూపించగలదో తెలియజేసేందుకు ఈ స్పోర్ట్స్‌‌‌‌ హ్యాకథాన్‌‌‌‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకోగా 20 మంది ఆవిష్కర్తల కాన్సెప్ట్స్‌‌‌‌ను ఎంపిక చేశామన్నారు.