స్పోర్ట్ కోటా పంచాయతీ సెక్రటరీ జాబితా రిలీజ్..తెలంగాణ రాష్ట్రంలో 172 మందికి ఉద్యోగాలు

స్పోర్ట్ కోటా పంచాయతీ సెక్రటరీ జాబితా రిలీజ్..తెలంగాణ రాష్ట్రంలో 172 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్, వెలుగు: నాలుగేండ్ల క్రితం జరిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలో స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో 172 మందికి ఉద్యోగాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా వెబ్ సైట్ లో ఉంచినట్లు పీఆర్ఆర్డీ డైరెక్టర్ జి. సృజన తెలిపారు. 

ఎంపిక లిస్టు, ఓఎంఆర్ షీట్లు సైతం https://epanchayat.telangana.gov.in/cs  వెబ్ సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు. 2021 సెప్టెంబర్ 17న ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.172 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. అందులో ఆదిలాబాద్- 6, భద్రాద్రి కొత్తగూడెం- 7, జగిత్యాల- 5, జనగాం- 4, జయశంకర్ భూపాలపల్లి, ములుగు- 6, జోగుళాంబ గద్వాల్‌- 3, కామారెడ్డి- 8, కరీంనగర్- 4, ఖమ్మం- 9, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్- 4, మహబూబాబాద్- 7, మహబూబ్‌నగర్, నారాయణపేట- 10, మంచిర్యాల- 4, మెదక్- 6, నాగర్‌కర్నూల్- 6, నల్గొండ- 13, నిర్మల్- 6, నిజామాబాద్- 8, పెద్దపల్లి- 3, రాజన్న సిరిసిల్ల- 3, రంగారెడ్డి- 7, సంగారెడ్డి- 8, సిద్దిపేట- 6, సూర్యపేట- 6, వికారాబాద్- 8, వనపర్తి- 3, వరంగల్ రూరల్- 5, వరంగల్ అర్బన్- 1, యాదాద్రి భువనగిరి- 6 పోస్టులు ఉన్నాయి