క్రీడాకారులు దేశానికి గుర్తింపు తేవాలి : ఉప్పల శ్రీనివాస్​గుప్తా

క్రీడాకారులు దేశానికి గుర్తింపు తేవాలి : ఉప్పల శ్రీనివాస్​గుప్తా

ఆలిండియా అండర్ –19 బ్యాడ్మింటన్ టోర్నీ షురూసికింద్రాబాద్, వెలుగు : క్రీడలు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా దేశానికి గుర్తింపు తెచ్చిపెడతా యని తెలంగాణ టూరిజం సంస్థ మాజీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్​అసోసియేషన్​వైస్​ చైర్మన్​ ఉప్పల శ్రీనివాస్ ​గుప్తా పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్​ఆర్ఆర్ సీ గ్రౌండ్​లో ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్–19 బాయ్స్ అండ్ గర్ల్స్​పోటీలను ప్రారంభించి మాట్లాడారు.  క్రీడాకారులు రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు.

ఈనెల 9 వరకు జరిగే బ్యాడ్మింటన్​ పోటీల్లో వివిధ రాష్ర్టాల నుంచి 900 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చండేశ్వరరావు, బ్యాడ్మింటన్​క్రీడాకారుడు శ్రీకాంత్ , రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా బ్యాడ్మింటన్​అసోసియేషన్​ ప్రతినిధులు పుల్లూరి సుధాకర్, ట్రెజరర్ బాబు, ఆనంద్  లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.