
హైదరాబాద్, వెలుగు: తెలుగు వర్సిటీలోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు. డిగ్రీలో చిత్ర లేఖనం, డిజైన్(ప్రొడక్ట్), డిజైన్( ఇంటీరియల్), లైబ్రరీ సైన్స్ కోర్సులు ఉండగా.. పీజీలో చిత్రం శిల్పలేఖనం, జానపదం రంగస్థల కళలు, తెలుగు, సంగీతం, నృత్యం, చరిత్ర సంస్కృతి పర్యాటక, భాషాశాస్ర్తం, జ్యోతిషం వంటి కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాజమండ్రి క్యాంపస్లో ఎంఏ(తెలుగు), శ్రీశైలం ప్రాంగణం ఎంఏ(చరిత్ర,సంస్కృతి,పురావస్తు), కూచిపూడి ప్రాంగణం(కృష్ణా జిల్లా)లో ఎంపీఏ డ్యాన్స్ కోర్సుల్లో చేరేందుకు అవకాశముందన్నారు. ఈ నెల 25లోగా ఆయా క్యాంపసుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు.