కారు ఢీకొని చుక్కల దుప్పి మృతి

కారు ఢీకొని చుక్కల దుప్పి మృతి

జన్నారం, వెలుగు: జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో కారు ఢీ కొని ఓ చుక్కల దుప్పి చనిపోయినట్లు జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హఫీజొద్దిన్ తెలిపారు. హనుమాన్​మందిర్ సమీపంలోని మూలమలుపు వద్ద చుక్కల దుప్పి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని గాయపడింది.

వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారమివ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి దుప్పికి వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందిందని రేంజ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కారును స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని తెలిపారు.