న్యూఢిల్లీ: యోగా బార్ పేరుతో న్యూట్రిషన్ ప్రొడక్టులు అమ్మే స్ప్రౌట్ లైఫ్ ఫుడ్స్ ఈ నెల 1 నుంచి తన సబ్సిడరీగా కొనసాగుతుందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీ ప్రకటించింది. షేర్‌హోల్డర్ల ఒప్పందం ప్రకారం ఐటీసీకి స్ప్రౌట్‌లైఫ్ బోర్డులో మెజారిటీ డైరెక్టర్లను నియమించే హక్కు లభించింది.
ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 47.5 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. బోర్డు నియంత్రణ హక్కు రావడంతో కంపెనీల చట్టం ప్రకారం ఈ సంస్థ ఐటీసీకి సబ్సిడరీగా మారింది. ఈ లావాదేవీకి కొత్తగా ఎలాంటి చెల్లింపులు జరగలేదు. అలాగే ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కిందకు రాదు. ఐటీసీ తన ఫుడ్ బిజినెస్‌ను విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. స్ప్రౌట్‌లైఫ్ 2015లో ఏర్పాటయ్యింది.
