
నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. గురువారం విడుదలైన ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి వరల్డ్ వైడ్ యునానిమస్‌గా మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుముందు మరిన్ని మంచి చిత్రాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఇది చాలా రిచ్ ఫిల్మ్. ఫన్, ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి అన్నీ ఉన్నాయి. ఈ వీకెండ్ కి మంచి సినిమా చుశామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని అన్నాడు. తెలుగులో చేసిన మొదటి సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పింది ఐశ్వర్య మీనన్. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉందని దర్శక నిర్మాతలు అన్నారు.