ఆ భర్తలకు ఒళ్లంతా కళ్లే.. భార్యలపై అనుమానం..స్పైవేర్ వినియోగంలో భారత్ రెండో స్థానం

ఆ భర్తలకు ఒళ్లంతా కళ్లే.. భార్యలపై అనుమానం..స్పైవేర్ వినియోగంలో భారత్ రెండో స్థానం

దేశంలో  ఐటీ ఉద్యోగం చేసే 70శాతం భర్తలు భార్యల్ని అనుమానిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ తో పాటు మనదేశంలో భార్యల్ని అనుమానించే భర్తలు స్పైవేర్ సాయంతో నిఘూపెడుతున్నట్లు డొమెస్టిక్ వైలెన్స్ చారిటీ రిఫ్యూజ్ సంస్థ తెలిపింది.

వాళ్లిద్దరు భార్య భర్తలు. భార్య ఇంట్లో బండెడు చాకిరితో పిల్లల్ని సాకుతుంది. భర్త ఐటీ ఉద్యోగం. అసలే ఐటీ ఉద్యోగి పని ఒత్తిడి, భార్య పై అనుమానం. వీటన్నింటికి తోడు అందివచ్చిన టెక్నాలజీ. ఇంకేం ఓ రూ.13వేలు పెట్టి ఫోన్ లో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ భర్త ఒంటినిండా కళ్లేసుకొని..ఆఫీస్ కు వెళ్లినా సరే ఇంట్లో భార్య ఏం చేస్తుందో చూసేవాడు.

ఓ రోజు బాధితురాలు ఇంటి ఆరు బయట పిల్లల్ని ఆడించి ఇంట్లోకి తీసుకొని వస్తుండగా..డోర్ బెల్ కి కెమెరా  ఉంది. అప్పుడు అర్ధమైంది. భార్యకు తన భర్త తనపై నిఘూ పెట్టారని.

ఇదిగో ఇలా నిఘూ పెట్టడంలో 70శాతం మందికి పై ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు డొమెస్టిక్ వైలెన్స్ చారిటీ రిఫ్యూజ్ సంస్థ తెలిపింది.  ఈ సందర్భంగా రివ్యూజ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భార్యలపై అనుమానం పెట్టుకునే భర్తలు రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తెలిపారు. బ్రిటన్, అమెరికా తో పాటు ఇతర దేశాల్లో ఈ స్పైవేర్ ను విచ్చలవిడిగిగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

స్పైవేర్ అత్యధిక స్థాయిలో రష్యా వినియోగిస్తుందని సైబర్ భద్రత సంస్థ కాస్పర్‌స్కీ చెప్తోంది. రష్యా తర్వాతి స్థానాల్లో వరుసగా ఇండియా, బ్రెజిల్, అమెరికా, జర్మనీలు ఉన్నాయి. బ్రిటన్ ఎనిమిదో స్థానంలో ఉంది.

యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఇలాంటి స్పైవేర్ లు వినియోగించడం చట్టరిత్యా నేరం. అందుకే స్పైవేర్ తయారీ సంస్థలు తమ వెబ్ సైట్లలో స్పైవేర్ ను వినియోగించడం చట్టరిత్యా నేరం అని పెట్టినా..భార్యలు ఏం చేస్తున్నారో భర్తలు ఈ స్పైవేర్ సాయం తో తెలుసుకోవచ్చంటూ అమ్ముతున్నట్లు  కాస్పర్‌స్కీ తెలిపింది. గతేడాది 37,532 డివైజ్‌లలో స్టాకర్‌వేర్‌ను తమ భద్రతా సాంకేతిక పరిజ్ఞానం గుర్తించినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు.