అర్జున..ఫల్గుణ టీజర్ రిలీజ్

 అర్జున..ఫల్గుణ టీజర్ రిలీజ్
  • ‘అదిరిందిగా.. న్యూ వెరైటీకి సెల్యూట్: రానా

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతోనూ కమర్షియల్ సక్సెస్‌‌లు అందుకోవచ్చని ప్రూవ్ చేస్తున్న శ్రీవిష్ణు నుంచి వస్తున్న మరో సినిమా ‘అర్జున ఫల్గుణ’. ‘జోహార్‌‌’ ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. అమృతా అయ్యర్ హీరోయిన్. నిరంజన్ రెడ్డి, అన్వేష్‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నిన్న ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. ‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు, అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌‌తో పాటు  ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌‌లు ఆకట్టుకున్నాయి. తమది కాని ప్రాంతంలో సస్టెయిన్ అవడానికి ఐదుగురు ఫ్రెండ్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథని అర్థమవుతోంది. మహాభారతంలోని పాండవుల అజ్ఞాతవాసం ఇన్‌‌స్పిరేషన్‌‌తో రాసిన కథలా కనిపిస్తోంది.

జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ, ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్‌‌ కుమార్ చౌదరి, చైతన్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిసారీ డిఫరెంట్‌‌గా వస్తున్నా.. ఈసారి కూడా డిఫరెంట్‌‌గానే వస్తున్నా..  కానీ పక్కా ఊర మాస్ రోల్‌‌తో’ అంటూ టీజర్‌‌ని‌‌ ట్వీట్ చేశాడు శ్రీవిష్ణు. ‘అదిరిందిగా.. న్యూ వెరైటీకి సెల్యూట్’ అంటూ రానా మెచ్చుకున్నాడు.